ఆకుపచ్చ అలలు;- - డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871.
ఆకులూ కొమ్మలే కాదు 
అలలు కూడా
ఆకుపచ్చ దారాలను అల్లుకున్నవిక్కడ

ప్రకృతిసిధ్ధంగా పచ్చగా ఉంది
నీటి పుట్ట ఇప్పుడు
ఆక్సీజన్ క్లోరోఫిల్ కలిసిన 
గాలిలో నది నడకగా

పర్యావరణ పరిరక్షణకు 
 తోలింది నన్ను దయతో
కాలుష్యానికి సంకెల వేసేటి గ్రీనరీ 
ప్రవాహించే నది ఊగింది అందాలతో
ఆకుపచ్చ తుంపరల అలలై

మనిషి పచ్చగుండుడే 
 ప్రకృతిలో ఆశ
ప్రకృతిని బతికించుడే మనిషి సోయి 
మనిషీ ప్రకృతీ 
 పరస్పర చరాచరులే కాదు
సమాంతర చలనాచలన జీవులు కూడా

మనసు పెడితే మనిషి
పచ్చపచ్చగా ఎదుగు లోకమంతా
పచ్చని వస్త్రధారణలో
నేల పలకరిస్తున్న ప్రకృతి
ఆకాశం విహరిస్తున్న ఆకుపచ్చ నీటి గూడు


కామెంట్‌లు