శ్రీలక్ష్మీ నారాయణులు;- శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
  🪷వైకుంఠ లోకమునకు
 మనకు, అధిపతులు!
      శ్రీలక్ష్మీ నారాయణులు!
 ఓ సుమతీ! ఓజోవతి!
        (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 👌"శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం.నమః!" అని, ప్రతీ పూజాకార్య క్రమమునందు స్మరించుకొనుచున్నాము. మనకు ఆదర్శ దంపతులు.. లక్ష్మీ నారాయణులే!
  👌శ్రీదేవి.. సలక్షణ యుక్త మైనది. కనుక, లక్ష్మీదేవి! ఆమె.. విష్ణుమూర్తి వక్షస్థలమందు ఉంటుంది! వక్షస్థలములోని హృదయము.. ఆలోచనలకు కూడలి! అక్కడే శ్రీమాత యైన వైష్ణవి.. నివాస ముంటుంది! అంటే, భార్య భర్తల హృదయం ఒక్కటై; ఆలోచనలు కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉండాలి! ఆ ఆలు మగలే.. లక్ష్మీ నారాయణుల జంట!
       🚩చంపకమాలా వృత్తం:
       రమ నావక్షముపైన దాల్చు హరిగా లావణ్య మొప్పారగా
     సుమతిన్ జాటెడునట్లు దంపతులిలన్ శోభప్రదాత్మీయతన్
       విమలమ్మౌ చరితమ్ముతో పరగినన్ వెన్నుండు శ్రీ లక్ష్మితో
       రమణీయమ్ముగ నుండునట్లు కన నారాధింపగా యోగ్యులౌ
       ( రచన: డా. శాస్త్రుల రఘుపతి., )

కామెంట్‌లు