పూవుల్లాంటి పిల్లలం*(బాల గేయం ); - ప్రభాకర్ రావు గుండవరం (కలం పేరు : మిత్రాజీ )- ఫోన్ నం.9949267638
పూవుల్లాంటి పిల్లలం
అల్లరి ఆకతాయులం
ఆటలు చక్కగా ఆడుతాం 
పాటలు చక్కగ పాడుతాం

మబ్బు తోటి లేచేస్తాం
మంకు పట్టి చదివేస్తాం
టూత్ బ్రష్కు పేస్ట్ పెట్టి
ముఖం బాగా కడిగేస్తాం

నల్ల నీళ్లు ఒడుపుగ పట్టి
శుభ్రంగ స్నానం చేస్తాం
అమ్మ ఇచ్చిన ఇస్త్రీ డ్రెస్స్
నల్గకుండ వేసుకుంటాం

నానమ్మ పెట్టిన టిఫిన్
అల్లరి చేయక తినేస్తాం
తాతయ్య వెంట రాగా
స్కూల్ బస్సులో ఎక్కేస్తాం

ఆడుతూ పాడుతూ
చదివేస్తాం అందర్నీ
మేం మెప్పిస్తాం
లంచ్ బాక్స్ ఖాళీ చేసి
ఇంటికి తిరిగి వచ్చేస్తాం

అమ్మ చెప్పిన
హోమ్ వర్క్ చేసి
ఆరు బయట తిరిగేస్తాం
చీకటి పడగా ఇంటికి వచ్చి
అన్నం తినేసి పడుకుంటాం
*********

కామెంట్‌లు