అందరం కలసి ఉందాం*; - ప్రభాకర్ రావు గుండవరం ( మిత్రాజీ )- -ఫోన్ నం.9949267638
స్నేహం అనే
ఆకాశంలో తళుక్కుమనే
మెరిసే తారలం మనం

మనకెందుకు విభేదాలు
మనకొద్దు తారతమ్యాలు
అమృతమైన మాటల తేనెలతో
ఆనందాలు పంచుకుందాం

అవ్యాజమైన
అనురాగంతో ఆత్మీయంగా ఉందాం
ఉన్న నాలుగు రోజులు
అందరం కలిసి ఉందాం.

రాజకీయాలు వ్యాపారాలు కాదు
అవి మనకు ముఖ్యం
మన స్నేహంలోని మధురిమలు
మన జీవితానందానికి అందించాలి ఆప్యాయతలు అనునిత్యం

కామెంట్‌లు