నిజమైన మిత్రుడు*(చిన్న కథ ); - ప్రభాకర్ రావు గుండవరం కలం పేరు : మిత్రాజీ )-ఫోన్ నం.9949267638
 ఆఫీసర్ ఆమాట చెప్పగానే దేవిక మనసు ఒక్కసారే షాక్ తిన్నట్టయ్యింది. ఇప్పుడెలా!!?
 సాక్ష్యం పై ఎవరు సంతకం పెడతారు. ఎవరూ పెట్టకపోతే శాంక్షన్ ఐనా నాలుగు లక్షలు మళ్ళీ రావు. డబ్బు మంజూరు అయ్యింది మీరు వచ్చి చెక్కు తీసుకుని వెళ్ళండి అంటే ఆ దేవునికి దండం పెట్టుకుని డ్యూటీకి కష్టంగా సెలవు పెట్టి ఆఘమేఘాల మీద ఆనందంతో  పరుగేత్తుకుంటూ వచ్చాను. తీరా వచ్చాక సాక్షి సంతకం కావాలి అంటున్నారు.హే భగవాన్!
నాకు సాక్ష్యం సంతకం ఎవరు పెడతారు. నా కూతుర్ని విదేశాలకు ఎంతో సంతోషంగా పంపాలనుకున్నాను.
చటుక్కున ప్రకాష్ జ్ఞాపకం వచ్చాడు.అతనే నాకు దేవుడిలాంటి వాడు. మంచి మిత్రుడు. నాకు తప్పకుండా సాయం చేస్తాడు. అంతే. దేవునికి దండం పెట్టి ప్రకాష్ కు ఫోన్ చేసింది.
"ప్రకాష్ నేను స్కాలర్ షిప్ ఆఫీస్లో ఉన్నాను. ఎన్ని పనులున్నా మీరు త్వరగా రావాలి. అమ్మాయికి స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యింది. మీరు కాస్త ఫార్మాలిటీస్ గా సాక్షి సంతకం చేయాలి " అని చెప్పగానే
" సారీ దేవికా నేను ఇప్పుడు రాలేను ఐనా విట్నెస్ ఇవ్వలేను " అని చల్లగా చెప్పాడు ప్రకాష్.
ఇంతలో మేడం  మీరు త్వరగా రావాలి అంటూ ఆఫీస్ వాళ్ళు పిలుస్తున్నారు.
 ఒక్కసారే దుఃఖం పొంగుకు వచ్చింది దేవికకు కన్నీరు జల జలా కారుతూనే ఉంది. ఆమె పడే ఆవేదన ఫోన్ సంభాషణ అక్కడే
 ఓ మూలకు ఉన్న ఓ వ్యక్తి ఇది గమంచి
 "అమ్మా మీరు ఆ డాక్యుమెంట్ నాకు ఇలా ఇవ్వండి. నేను సాక్షి సంతకం పెడతాను"* ఆంటూ తానే ఆ కాగీతం తీసుకుని సంతకం పెట్టి సబ్మిట్ చేసి ఆమె చేతిలో నాలుగు లక్షల చెక్కు పెట్టి ధైర్యంగా ఉండండి అని నవ్వుకుంటూ వెళుతున్న అతని వైపు చూసి అప్రయత్నంగా చేతులు జోడించి మొక్కింది దేవిక.
***********

కామెంట్‌లు