రామరాజ్యం;- ల్యాదాల గాయత్రి-9949431849

 అనగనగా విదర్భ దేశాన్ని శూరసేనుడు పాలించేవాడు.ప్రజలందరూ రాజుగారి పాలన రామరాజ్యాన్ని మరిపిస్తుందని గొప్పగా చెప్పుకునేవారు.ఆనోటా ఈనోటా పొరుగుదేశంలో ఉన్న  వీరేంద్రకు తెలిసింది.ఒకసారి వెళ్ళి రాజ్యం లోని విశేషాలు తెలుసుకోవాలనుకున్నాడు.
            ఆ సమయం రానే వచ్చింది.ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న యువకులకు శూరసేనుడు ఆహ్వానం పంపాడు.విదర్భ రాజ్యంలో ఇరవై ఒక్క రోజులు అతిథులుగా మర్యాదలు స్వీకరించడానికి అవకాశం కల్పించాము.వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు.కానీ వచ్చినవారు రెండు మంచి అలవాట్లు అలవరచుకొని వెళ్ళాలని,ఆ ఇరవైఒక్క రోజులు కోపతాపాలకు అతీతులుగా ఉండాలనీ,వారి రాజుగారి వద్ద నుండి ఆదేశపౌరుడిగా వస్తున్నట్లు లేఖ తీసుకురావాలని షరతు విధించాడు.ఈ అవకాశాన్ని వీరేంద్ర ఉపయోగించుకున్నాడు.అలా పొరుగు దేశాలనుండి యువకులు విదర్భ రాజ్యానికి పయనమయ్యారు.
            శూరసేనుడు యువకులకోసం ఏర్పాట్లు చేయించాడు.మంత్రిని పిలిపించి సమాలోచనలు జరిపాడు.యువకులందరితో పాటు వీరేంద్ర చేరుకున్నాడు.ప్రయాణబడలిక తీర్చుకుని ,అందరు ఉదయం ఆరుగంటల కల్లా కాలకృత్యాలు తీర్చుకొని సిద్ధంగా ఉండాలని సమాచారాన్ని అందించాడు.
              మరుసటి రోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు ముగించుకొని యువకులంతా సిద్ధమైనారు.ఆరుగంటలకు శూరసేనుడు యువకులను ఉద్దేశించి ప్రసంగించారు.
      " విదర్భ దేశానికి అతిథులుగా విచ్చేసిన యువకులందరికీ సాదర స్వాగతం.ఈరోజు నుండి సరిగ్గా ఇరవై ఒక్క రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ,మారాజ్యం లోని వింతలు, విశేషాలు తెలుసుకోండి.ప్రజల జీవనవిధానాన్ని గమనించండి.అందుకు తగిన అన్ని ఏర్పాట్లను చేయడమే కాకుండా ,తగిన బలగాన్ని కూడా ఏర్పాటు చేస్తాను " అన్నారు.అందరూ ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేసారు.
         ప్రణాళిక ప్రకారం ఆయుధశాలలు,విద్యాలయాలు,అటవీ ప్రాంతాలు ,సామాజిక స్థితిగతులు ,జీవనవిధానం అన్నీ వివరంగా తెలుసుకున్నారు యువకులంతా.సమయం పూర్తయింది . చివరిరోజు శూరసేనుడు యువకులతో సమావేశమై వారి మనోభావాలను,అభిప్రాయాలను తెలుసుకున్నాడు.
    మన షరతు ప్రకారం మీరు రెండు మంచి అలవాట్లు చేసుకున్నారు.ఒకటి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం,రెండు సమయపాలన పాటిస్తూ పద్ధతి ప్రకారం ఆచరించడం.మానవుని ఉన్నత స్థితికి,అభివృద్ధికి కారణాలివే.యువత ఈ అలవాట్లను పెంపొందించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు".యువకులందరితో పాటు వీరేంద్ర సంతోషంగా స్వదేశాలకు పయనమయ్యారు.
   .. 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం