మా ఊరి చెరువు -ఎ. ప్రణవి-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట మండలంజనగామ జిల్లా
 మా ఊరిలో ఒక అందమైన చెరువు ఉన్నది.ఆ చెరువు అంటే నాకు చాలా ఇష్టం. చెరువు ఎప్పుడు నీటితో నిండుగా కళకళలాడుతూ ఉంటుంది.అది మా ఊరి చివరన ఉంటుంది. బతుకమ్మ పండుగకు మా  చెరువు ఆనందంతో మురిసిపోతుంది.ఊరి నుండి చెరువు వరకు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.ఊరు మధ్యలో బతుకమ్మలు ఆడిన తర్వాత అందరూ బతుకమ్మలని తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తారు. వర్షాకాలంలో చెరువు నుండి మత్తడి పోస్తుంటే చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ నీళ్ల శబ్దం గమ్మత్తుగా అనిపిస్తుంది మా ఊరి పంట పొ

లాలకు నీళ్ళనందించే చెరువు మా ఊరికి ఆధారం. బతుకమ్మలను నీటిలో వదిలి పెడుతూ పాటలు పాడుతారు.తర్వాత ప్రసాదం పంచుకొని ఇంటికి తిరిగి వస్తాము.మా ఊరి చెరువుతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పది.మా ఊరికి అందం చెరువు.మా పంట పొలాలకు ఆధారం చెరువు.
కామెంట్‌లు