పనియే దైవం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా సాయి వాదించుకుంటున్నారు" దేవుడు గొప్ప. పూజలు బాగా చేస్తే మన కోరికలు తీరుస్తాడు" అన్నాడుసాయి. "మనం సోంబేరులా కూచుని దేవుని పూజిస్తే లాభంలేదు " వాదించాడు శివా. వారి మాటలు విన్న తాత అన్నాడు " ఊళ్లో డాక్టర్ ఒక్క రోజు కూడా గుడికి వెళ్లడు. దేవుడిని తలవడు.కానీ ఎంత బీదబిక్కీ ఐనా సరే వారింటికి వెళ్లి సాయం చేసే వాడు.సాధువు ఒకడు వచ్చి "ఈఊరిలో ఎంత మంది గుడి కి వెళ్లి పూజలు చేస్తారు?" అని అడిగితే అంతా చేతులు ఎత్తారు.వైద్యుడు చేయి ఎత్తలేదు." స్వామి!నేను గుడి పూజలు అంటూ ప్రత్యేకంగా చేయను.కానీ తెల్లార్తూనే రోగులను పరామర్శిస్తాను.వారు సంతోషం గా ఇచ్చినది నేను పుచ్చుకుంటాను.మానవసేవే మాధవ సేవ అని మాగురువుగారు చెప్పారు. కానీ అంతా నన్ను నాస్తికుడు అంటారు ". తాత  ఈకథ చెప్పి  ఇందులో నిజమెంత?" అని అడిగాడు. శివా అన్నాడు "తాతా!వైద్యుడు నిజమైన దైవభక్తి కలవాడు.రోగిలో హరిని చూస్తున్నాడు. " తాత  శభాష్ అన్నాడు. 🌹
కామెంట్‌లు