సుప్రభాత కవిత ; - బృంద
స్వచ్ఛమైన  నీటి అద్దంలో
అచ్చమైన నింగి రూపం
అంతరంగాన ప్రతిఫలించు
అంతర్యామి స్వరూపం

మర్మమెరుగని  అభిమానం
అంతులేని అనురాగం
షరతులు లేని  మమకారం
అవధులు ఎరుగని ఆత్మీయత

కొన్ని మమతలు కోరవు ఏమీ
అన్నీ తామై ఆదరించేవి
అంతా నీదే అనిపించేవి
అర్థం కాని అనుబంధాలు

గుండెల నిండుగ  ఎడతెగక
ఎపుడూ జరిగే ఏరువాక
మమతల  సేద్యపు  దిగుబడి
మదిలో ఆరని ఒక తడి

కన్నుల మెరుపుల పంటలు
పెదవుల దాగిన నవ్వులు
మోగిన తలపుల మువ్వలు
విరిసే మనసున పువ్వులు

మనమే పెంచుకున్న 
మనసైన బంధాల ఉద్యానం
బరువును మరిపించి
బ్రతుకును చేయును మధురం

మనసును మురిపించే ముచ్చటైన
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు