వ్యోమగాములు (గేయ కథ) - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
మొగ్గ లాంటి పిల్లల్లారా
మొగులు పైకి చూడండి
తోకచుక్క రూపులోన
పొగ చిమ్ముతూ పోతుంది!!

అది ఏమిటో మీకు తెలుసా
అది ఒక పెద్ద రాకెటండి
ఆ రాకట్లో ఎవరున్నారో తెలుసా
వ్యోమగాములున్నారు!!

ఆకాశం పైకి వెళ్తూ వారు
గ్రహాంతరాలు దాటుతూ
చంద్రమండలం చేరుతారు
చంద్రునిపై దిగుతారు వారు!!

అచ్చటి రాళ్లు మట్టిని తీసి
వారు చేతబట్టి చూస్తారు
దాని సారము తెలుసుకొని
వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు!!

ఆచటికెళ్ళిన పరిశీలకులు
కొన్ని నెలలు నివాసముండి
చందమామ సంగతులన్నీ
చక్కగా విశ్లేషించితారు వారు !!

చంద్రమండలం సంగతులన్నీ
కెమెరా ద్వారా భూమి పైకి
పంపించి చూపుతారంట
చల్లని ఆ జాబిల్లి గూర్చి విన్నారా!!

ఓ చిట్టి పొట్టి పిల్లల్లారా
ముద్దుగా మీరు ఎదగండి
పెద్ద చదువులు చదవండి
మీరు కూడా చంద్రుని పైకి వెళ్ళండి !!

చక్కగా మొక్కలు నాటండి
చిన్న చిన్నగా ఇండ్లు కట్టండి
జననివాసమక్కడ ఏర్పర్చి
చక్కని సందేశం పంపండి !!కామెంట్‌లు