తీపికబుర్లు ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తీపికబుర్లు
అందిస్తా
తేటతెలుగును
చిందిస్తా

తీపిలేని
పలుకులు
రుచిలేని
వంటకాలు

తీయదనములేని
స్నేహాలు
వెన్నెలకాయని
రాత్రులు

మధురములేని
జీవితాలు
సంతానములేని
గృహములు

పసలేని
పదార్ధాలు
వాడుకోలేని
వ్యర్ధాలు

మాధుర్యములేని
కవితలు
పసందులేని
అప్పచ్చులు

కమ్మదనములేని
కయితలు
ఇంపుసొంపులేని
ఇంతులు

స్వాదిమలేని
సమావేశాలు
ఉప్పువెయ్యని
కూరలవిందు

సురసములేని
సంసారాలు
పూలుపుయ్యని
పిచ్చిమొక్కలు

మధురిమలులేని
మాటలు
ముచ్చటపరచలేని
మోములు

తేనెలేని
పువ్వులు
ఆకర్షించలేని
అందాలు

మిఠాయిపొట్లము
ముందుపెట్టనా
చక్కెరపొంగలి
చేతికందించనా

పరమాన్నపాత్రను
పెదవులకందించనా
పాలుపంచదారలను
పాత్రలోకలిపివ్వనా

జిలేబిచక్రాలను
చేతికందించనా
గులాబిజామును
గుటకవేయించనా

పంచదారచిలుకలను
తినిపించనా
కలకండపలుకులను
నమిలించనా

పిప్పరమెంట్ల
ప్యాకెటివ్వనా
చాకులెట్ల
సంచినివ్వనా

పాలుమీగడల
పుచ్చుకోమందునా
పాయసముల
పసందుచెయ్యనా

పూతరేకుల
పళ్ళెమివ్వనా
బందరులడ్డుల
బుట్టనివ్వనా


కామెంట్‌లు