అంజనాదేవి-ఆంజనేయుడు.డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పాలకడలి లోఉద్బవించిన రంభా-ఊర్వశి-మేనక-పుప్పగంధి-సుకేసి-మహాశ్వేత-ప్రమ్లోచ-మనోరమ-ప్రమధర-ఘృతాచి-గీతాజ్ఞ-చారుహాసిని-చంద్రప్రభ-సోమ-విద్యున్మాల-అంబుజాక్షి-కాంచనమాల-వంటి 16,051మంది అప్సరసలలో ఒకతైన "పుంజకస్ధల"శాపవశాన కుంజరుని కుమార్తేగా "అంజనాదేవి"పేరున జన్మించింది. ఈమెభర్త కాంచనపర్వతనివాసి .ప్రముఖవానరవీరుడు ."శంఖం" "శబలం" అనేఏనుగులు ప్రభాసతీర్ధంలోని మునులఆశ్రమాలను ధ్వంసం చేస్తుండేవి.మునివర్యుల కోరికపై ఆ ఏనుగులను సంహరించడంతో సంతసించినమునులు ఏదైనా వరం కోరుకో అన్నారు. కోరినరూపంధరించగలిగే మహాబలశాలి అయిన పుత్రుని ప్రసాదించమని వేడుకున్నాడు కేసరి.త్వరలో శ్రీమహావిష్ణువు శ్రీరాముని గా జన్మించబోతున్నాడని ,అతనికి నమ్మినబంటుగా ఉండి లోకకల్యాణం కొరకు దుష్టశిక్షణ,రాక్షస సంహారంచేసే పుత్రుడు వాయుదేవుని వరాన నీకు కలుగుతాడని మునులు ఆశీర్వదించారు.ఒకరోజు అంజనాదేవి వనవిహారంచేస్తుండగా ప్రత్యక్షమైన వాయుదేవుడు"దేవి నీవు కారణజన్మురాలివి.నావలన నీకు మహాన్నతబలపరాక్రమ తేజోసంపన్నుడు ధీమంతుడు అయిన పుత్రుడుజన్మిస్తాడు "అని వరం ప్రసాదించి వెళ్ళాడు.కొంతకాలానికి ఆమెకు బిడ్డజన్మించాడు.అతనికి "సుందరుడు"అనిపేరుపెట్టారు.బాల్యంలో ఒకరోజు సూర్యుని పండుగా భావించి ఆకాశానికి ఎగసి సూర్యుని మింగబోయాడు.అడ్దగించి తనవజ్రాయుధంతో సుందరుని దవడ( హనుమ)భాగాన కొట్టాడు.సృహకొల్పోయిన సుందరుని చూసి అంజనాదేవి దంపతులు ఎంతగానో దుఖిఃచసాగారు.కొపంతో వాయుదేవుడు గాలిని స్ధంబింపజేసాడు.గాలిలేక సమస్తప్రాణకోటి గిలగిల లాడసాగాయి.శివుడు ప్రత్యక్షమై అమ్మ అంజనా బాదపడకు నీబిడ్డచిరంజీవి.అంజనాపుత్రుడు అయినందున "ఆంజనేయుడిగా"హనుమభాగంలో తికబడినవాడుగా అయినందున"హనుమంతుడుగా"పిలవబడతాడు.సుగ్రీవునికిమంత్రిగా,శ్రీరాముని నమ్మినబంటుగా సకలజనులచే కీర్తింపబడతాడు,రాబోవుకాలంలో అర్జునుని ధ్వజం పై కపిముద్ర ఉండేలా వరంప్రసాదిస్తాను"అని పలు వరాలుయిచ్చి,వాయుదేవునితోపాటు అందరిని సంతోషపరచి వెళ్ళాడు.
విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
; ;

కామెంట్‌లు