శ్రీ కృష్ణుడి మరణం ;-కొప్పరపు తాయారు
 ఒక రోజు కణ్వమహర్షి యాదవులు సంతోషాలతో
తేలియాడే సమయాన ఆయన ఆ దోవన వెళ్ళాల్సి వచ్చింది.
అప్పుడు అందులో ఆకతాయి ఆయన్ని అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో స్త్రీలాగ వేషం వేసుకుని తాను
గర్భవతిని అని ఏ బిడ్డ పుడతాడో అని వేధించాడు.
 చాలా. వరకు భరించి ఇంక కోపం రావడంతో మీ వంశం నాశనం చేయడానికి ముసలం పుడుతుంది
అని చెప్పి ఆయన వెళతారు. వెంటనే ఒక ఇనుప కడ్డీలావుగా ఉండేది పుట్టింది. దానికి అల్లరి చేసిన యాదవ యువకులు భయపడి బలరామ,కృష్ణుల
దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పి ఆ ముసలాన్ని  కూడా చూపుతారు.అప్పడు బలరాముడు దాన్ని
అరగదీసి  సముద్రం లో కలపండి అన్నాడు.
                అప్పుడు వారు కష్టపడి అరగదీసి, అరగదీసి, దాన్నీ  ఒక  బాణం అంత సన్నగా చేయగలుగుతారు. తర్వాత దానిని అరగదీసినౕ పొడి
నంతను ,ఆ సన్న బాణాన్ని సముద్రం నీటిలో  కలిపేస్తారు.
                చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ
ఇలాగే తాగి పండుగ చేసుకుంటూ అల్లరి చేస్తూ
ఉండగా, ఆ అల్లరే  శృతి మించి రాగాన పడి ఒకరిని
ఒకరు కొట్టు కుంటూ అది తీవ్రమై ఆ రెల్లు గడ్డి తో
కొట్టుకొని అందరూ చనిపోతారు.
            ఆ ముసలం ఒక అడవి జాతి వానికి దొరికింది. వెళ్తూ వెళ్తూ ఒక పిట్ట చెట్టు చాటున ఉన్నట్టనిపించి ఈ బాణం వేసేసరికి అటు నుంచి
అమ్మా అన్న శబ్దం విని వెళ్ళి చూస్తే పాపం శ్రీ కృష్ణుడు ఆవిధంగా మరణిస్తాడు.


కామెంట్‌లు