శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పరకీయ అంటే సాహిత్యం లో ఇలా చెప్పారు..తన భర్త ని అవహేళన చేస్తూ పరపురుషుని ప్రేమించే స్త్రీ.దీని  వ్యతిరేక పదం స్వకీయ.
పరమార్ అగ్నికులంలో ప్రసిద్ధ శాఖ.ప్రమార్ అన్నారు ఆంగ్లేయులు.మహారాష్ట్ర లో ఈపరమార్ కాస్త పవార్ గా మారింది.జగతదేవపరమార్ అనేపేరు మరాఠీ శిలాశాసనం లో ఉంది.దీనికో కథ ఉంది.విధర్మపరుల అత్యాచారాలు పెచ్చు పెరగటంతో బ్రాహ్మణులు అర్బుదగిరి (మౌంట్ అబూ)పై యగ్నంచేశారు.అగ్నికుండంలోంచి 4కొత్త వంశాలు పుట్టాయి.అవిపరమార్ సోలంకి చౌహాన్ పడిహార్.అబుల్ఫజల్ ఇలా రాశాడు "నాస్తికులతో ఉపద్రవం ముంచుకు రావడం తో ఆబూపర్వతంపై బ్రాహ్మణులు అగ్ని కుండంనించి పరమార్ సోలంకి చౌహాన్ పడిహార్ అనే 4వంశాల్ని సృజించారు.ఇంకో కథనం ప్రకారం ఆబూపర్వతంపై వశిష్ఠ మహర్షి ఉండేవాడు.ఆయన ఆవునందిని నా విశ్వామిత్రుడు మోసంతో దొంగిలించితే కోపంతో వశిష్ఠుడు అగ్ని కుండంకి ఆహుతులిచ్చాడు అందులోంచి ఓవీరపురుషుడుబైటికొచ్చి ఒంటరిగా శత్రువులను అంతం చేశాడు.ఆవుని ఋషికి సమర్పించాడు."నీవు పరమార్ అంటే"నీవు శత్రుహంతకుడివి అని ప్రశంసించాడు.శౌనకుని ఒక కొడుకు పేరు పరమార్.మాల్వప్రాంత పరమార్ లు పరాక్రమ శాలురు.విక్రమార్కుడు భోజమహారాజు ఈవంశంవారే.ఈవంశంకి చెందిన సోఢా సాంఖలా భయాల్ అనేవంశంవారు మార్వాడ్ లో నేటికీ ఉన్నారు.

కామెంట్‌లు