శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 దాస్ అని హిందీ లో దాసుడు అని తెలుగులో అంటాం.కబీర్దాస్ రామదాసు తులసీదాసు అని తమపేర్లుగామార్చుకున్నారు.ఇతరుల సేవ లో ఉండే వారు అని అర్ధం.రాజుల దగ్గర దాసి ఉండేది.రాణీ పరిచర్య చేసేవారు దాసీలు.వేదాల్లో  దాసు దస్యు అంటే శత్రువు అని అర్థం.మనువు ప్రకారం 7గురు దాసులు ఉన్నారు.యుద్ధంలో గెలిచిన దాసుని ధ్వజా హ్రత అని భోజనం కి నియమించిన వాడిని భక్తదాస్ అని ఇంటిదాసికి పుడితే గృహజ అని అంటారు.కొనుక్కున్నవాడిని క్రీత అని ఎవరిచేతనైనా ఇవ్వబడిన దాత్రిమ అంటారు.రాజు శిక్ష విధిస్తే దండదాస్ తాతతండ్రుల ద్వారా లభించే వాడిని పైతృక దాసులు అని అంటారు.నారదస్మృతిలో15మంది దాసులు ఉన్నారు.కౌటిల్యుని అర్థశాస్త్రం లో బానిస ఆచారం వర్ణించాడు.ఇక దాసీలు4రకాలు.దేవదాసి బ్రహ్మ దాసి స్వతంత్ర  శూద్ర దాసిక.ఒకప్పుడు యూరప్ లో బానిసలు జంతువుల కన్నా హీనంగా చూడబడినారు.
కామెంట్‌లు