వానాకాలం(బాల గేయం );- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
మహిళలు నింపుచుండగా నీటి కడవలు 
ఆవులు మేయుచుండె గడ్డి పరకలు
వానలతో వచ్చెనిచ్చోట వరదలు
దబ్బుదబ్బున పడుచుండె పిడుగులు

ఊరినిండా పెద్ద పెద్ద నీటి మడుగులు
ప్రజల చేతిలో నల్లని గొడుగులు 
తడబడుచుండె పెద్దవారి యడుగులు
అడుగులు వేయనివ్వవీ బురదలు

పిల్లలకు తల్లులు వేసిరి తొడుగులు
వాన నీటిలో కాగితపు పడవలు
వేయుచుండిరి చిన్నారి బుడుగులు
పిల్లల తొడుగుల కంటెను మరకలు


కామెంట్‌లు