పేద పిల్లల విద్యావసరాలకు విరాళాలు ఇవ్వండి


 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లల విద్యావసరాలకు, పాఠశాల అభివృద్ధికి దాతలు,  వ్యాపారస్తులు, సహృదయులు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఔత్సాహికులు, శ్రేయోభిలాషులు విరివిగా విరాళాలు అందించాలని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో బడిబాటలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని, దాతలు వస్తు రూపేణా, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. గత పదేళ్లలో తాను పనిచేస్తున్న ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.8 లక్షలు తన సొంత డబ్బు ఖర్చు చేసినట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాదేశానుసారం హెడ్మాస్టర్, ఎస్ఎంసి ఛైర్మన్, గ్రామ సర్పంచ్, దాతలతో ప్రత్యేకంగా 'మన ఊరు మన బడి డొనేషన్ ఖాతాను' ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లల విద్యావసరాలు (బ్యాగులు, షూస్, టై, బెల్ట్, బ్యాడ్జ్, ఐడి కార్డ్ మొదలైనవి) తీర్చేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాతలు, సహృదయులు  తమ విరాళాలను  మన ఊరు మన బడి డొనేషన్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొత్కపల్లి బ్రాంచ్) ఖాతా నెంబర్ 045712010000517, ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 080457 కు లేదా HM ఈర్ల సమ్మయ్య ఫోన్ పే/గూగుల్ పే నెంబర్ 8247721253 కు తమ విరాళాలు పంపించాలని హెచ్.ఎం. ఈర్ల సమ్మయ్య కోరారు. దాతలు అందించిన ప్రతి పైసా పాఠశాల అకౌంట్లో జమ చేయబడతాయని, విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఎస్ఎంసి, గ్రామ సర్పంచ్ తీర్మానం మేరకు ఈ డబ్బులు పిల్లల విద్యావసరాలకు వినియోగించడం జరుగుతుందన్నారు. దాతల పేరు, పూర్తి వివరాలు రోజూ వాట్సాప్, వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే పాఠశాలలో వారి పేర్లు, వివరాలు ప్రదర్శింపబడతాయని, ఆర్థిక సహాయం అందించిన దాతలు విరాళాలకు సంబంధించిన వివరాలను స్క్రీన్ షాట్/ఫోటోను 9989733035 అనే మొబైల్ నెంబర్ కు వాట్సప్ ద్వారా  పంపించాలని ఆయన కోరారు.
కామెంట్‌లు