పుట్టింటికి జై!(చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆమె పుట్టింటివారి కంటిదీపమైనా,
మెట్టినింటికే దీపంగా మారడం ప్రతి ఆడబిడ్డకూ తప్పదు కదా! పుట్టగానే "ఆడ" బిడ్డగానే పిలువబడుతుంది. కాని "ఈడ"బిడ్డగా కాదు కదా! పెళ్ళి అయి అత్తారింటికి వెళ్ళిపోయినా, పుట్టింట ఆడపడుచు లేనిదే బతుకమ్మయినా, బోనాలయినా, పండుగయినా, పబ్బమయినా, శుభమయినా, అశుభమయినా ఏకార్యమూ జరగదు.
ఆమెకు పుట్టింటిమీది అవ్యాజానురాగం
ఎవరూ విడదీయలేనిది. పుట్టింటి నేల మట్టిఅయినా మార్బుల్ అయినా
ఎటువంటి తేడా చూపదామె. మెట్టినింటిలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పుట్టిల్లు ఆమెకు అండగా ఉంటుంది. సకల మర్యాదలతో ఆత్మ స్థైర్యాన్నీ ధైర్యాన్నీ అందిస్తుంది. కులమతాలకు అతీతమైన ఈ సంప్రదాయం, ఈ సంస్కృతి భారతీయుల సొంతం. అందుకే పుట్టింటికి జై !!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు