పెరుగుట విరుగుట కొరకే;- శిరందాస్ శ్రీనివాస్--నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
అమాయకత్వం 
అందరితో కలిపింది
ఆధునికత 
అంతరాలు పెంచింది.

ఆటలూ పాటలు
ఆనందపు సరాగాలన్నీ 
అనుబంధాలను పెంచేవే నాడు
ఆర చేతిలో ప్రపంచం వచ్చాక
అన్ని బంధాలు తెగె నేడు.

ఎన్నెన్నో ఆటలు
అలుపు సలుపూ లేదు
ఉరుకులు పరుగులు
ఊరంతా బలాదూర్..
బడి కైనా గుడి కయిన
గుంపులు గుంపులుగానే నాడు
ఇప్పుడు బడిలో గుడిలో 
వీధిలో ఎవరి దారి వారిదే..

నాడు ఊర్లో అందరూ చుట్టాలే
నేడు అమ్మా నాన్నలే పరాయివారు 

ఫోన్ లేనప్పుడు 
ఆది మంచి అయినా చెడైనా
ఇంటి కెళ్ళి పలకరింపు
ఇంటిల్లి పాదికి ఊరడింపు 
ఫోన్ వచ్చాక 
పలకరింపు కరువై
మేసేజ్ బరువై 
సింపుల్ గా సింబల్ తో సరే సరి

ఆధునికత 
సుఖంతో పాటు 
రోగాలు తెచ్చింది..
వేగంతో పాటు
ప్రమాదాలు పెంచింది. 

విజ్ఞానంతో పాటు 
అజ్ఞానం పెంచింది
ఉపాధి తో పాటు
జీతాన్ని పెంచింది.. కానీ
జీవితాల బంధం తుంచింది.
బంధాల మధ్య అగాథం  పెంచింది.

పెరుగుట విరుగుట కొరకే
పెద్ద వారు చెప్పిన మాట 
సద్ది మూటే...కామెంట్‌లు