ఇది కూడా సైన్స్ ఏనా?; - ఎస్ మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ. మరి మీరు? విష్ యూ వెరీ హ్యాపీ డే!🤝.... ఈరోజు ఇంకో కొత్త విషయంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూద్దామా?మనం నీటిని ఎలా తాగుతాము? ఇది కూడా ఒక సమస్యేనా అనిపిస్తుంది కదా! గ్లాసును లేకపోతే నీరు నిండిన చెంచాను నోటు దగ్గరికి తీసుకు వస్తాము. పీల్చేస్తాము.ఇది చాలా సులువైన సంగతి. కానీ నీరు మన నోటిలోకి తోసుకొని వస్తాయి. ఎందుకు తోసుకొని వస్తాయి? దానికి సమాధానం చూద్దాం. మనం నీరు తాగేటప్పుడు మన ఊపిరితిత్తులు పెద్దవవుతాయి. కాబట్టి నోటిలో గాలి తగ్గుతుంది. దాంతో ఊపిరితిత్తుల్లో ఒత్తిడి తక్కువ అవుతుంది. బయట గాలి ఒత్తిడి, నీటిని, ఒత్తిడి తక్కువగా ఉండే వైపుకు తోస్తుంది. అంటే ఊపిరితిత్తుల వైపుకు. అదే పీల్వడమన్నమాట. ఏదైనా సీసా మూత ఉంచి తాగితే నీరు లోపలికి వెళ్ళవు. దానికి కారణం మూత అడ్డుగా ఉందని మనం అనుకుంటాం. దాంతోపాటు ఇంకో కారణం కూడా ఉందండీ. సీసాలో ఒత్తిడి బయట గాలిలో ఒత్తిడి సమానంగా ఉంటుంది. అందుకని ఆ నీరు సీసాలోనే ఉంటుంది. కొంచెం వింతగా ఉంది కదా! నాక్కూడా! సరే మరి! ఇంకో కొత్త విషయంతో మనం త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్!సి. యూ ఫ్రెండ్స్.....
కామెంట్‌లు