ఎవరిపని వారే! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత అన్నాడు "పిల్లలూ!బడి తెరిచే రోజులు దగ్గర పడుతున్నాయి. పుస్తకాలకి బట్టలు వేసి పేర్లు రాశారా?"" ఆ!అమ్మా నాన్నా వేస్తారులే తాతా! ఐనా నీవు వేయొచ్చు కదా?' "ఓరీ తాతకు దగ్గులు నేర్పే రకాలు మీరు. మీవయసులో నేను  పురపాలక ఊడ్చి పాలు పితికేవాడ్ని.మీనాన్న  పాలపాకెట్స్ పేపర్ బాయ్ గా పనిచేసి కాలేజీ చదువు ఉద్యోగం సంపాదించాడు.
మీకో కథ చెప్తా వినండి. అనాథ పిల్లాడికి ఎవరో మంత్రం చెప్పి  -"ఇది జపిస్తే చాలు. దేవుడు  అంతా చేస్తాడు అంటే పాపం వాడు అలాగే జపం చేస్తూ కూచున్నాడు రెండు రోజులు. మూడోరోజు నీరసంగా ఉన్న వాడిని ఊరిపెద్ద చూసి ఇలా అన్నాడు "ఓరి అమాయకుడా ఉట్టి మంత్రం చాలదు.పనిచేస్తూ నామజపం చేస్తే ఫలితం త్వరగా దక్కుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తా." అలా అనాధాశ్రమంలో పెరిగి కష్టపడి చదివి  నేడు ఓపరిశ్రమపెట్టి అందరికీ  ఆదర్శంగా ఉన్నాడు.కష్టేఫలీ! గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ అనరాదు." అంతే పిల్లలంతా కిక్కురు మనకుండా పుస్తకాలు అట్టలు తెచ్చి  సరైన సైజు లో పెట్టి కట్ చేస్తే  తాత  ఎలా పుస్తకం కి అట్ట వేయాలో చూపి  పిన్నులు కొట్టాడు.పిల్లలు తమపేరు క్లాస్ రాసి మురిసి పోయారు. 🌹
కామెంట్‌లు