అపార్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "నాపెన్ను నీవే తీసి దాచావు" శివా  శివాలెత్తుతూ ఆరుంబాకా నోరుపెట్టుకుని అరుస్తున్నాడు. "నీపెన్ను నేనెందుకు తీస్తాను?  మతిమరుపు పెద్దయ్యా" ఇంకా గట్టిగా అరవసాగింది జయ."ఏమిటి టాప్ ఎగరగొడుతున్నారు ?" తాత రాగానే ఇక లొడలొడ ఎవరిగొడవ వారు చెప్పసాగారు."నేనో కథ చెప్తా వినండి. తప్పు గా అవతలి వారి ని అర్ధం చేసుకోవటాన్ని అపార్ధం  అంటారు. ఓపిట్ట ఓమోడువారిన చెట్టు దగ్గరకు వెళ్లి "నీకొమ్మల్లో గూడు కట్టుకుంటాను" అంది."ఊహా!వద్దు " గట్టిగా అంది చెట్టు. పక్కనే గుబురుగా ఓ పెద్ద తీగె బాగా పైకి పాకింది. ఆ చెట్టు చెట్టుకొమ్మ దాకా అల్లిబిల్లిగా అల్లుకుపోయింది.పిట్ట హాయిగా ఆతీగె గుబురులో గూడు కట్టి గుడ్లు పెట్టింది.ఓరోజు  ఎవరో వచ్చి    చెట్టుని కాస్తా మొదలంటా నరికేశారు.పిట్ట ఆనేలకూలిన చెట్టు దగ్గర వాలింది."పిట్టమ్మా!నేను ఎండిమోడుగా మారాను.నన్ను మనిషి ఎప్పుడో కొట్టేస్తాడని నాకు తెలుసు. అందుకే నాపైన నిన్ను గూడు కట్టనివ్వలేదు." పిట్ట పశ్చాత్తాపం తో అంది " నిన్ను  అపార్ధం చేసుకున్నాను.నన్ను క్షమించు" తాత కథ చెప్పి అన్నాడు "ఠక్కున ఎవరినీ అపార్ధం చేసుకోరాదు."సారీ అంటూ పిల్లలు కిలకిలా నవ్వేశారు 🌹.
కామెంట్‌లు