చీకటి రాగాలు;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 సంద్రం ఒడిలో ఒదిగి అలలు ఊయలలూగుతుంటే...
సాగర సమీరాలు సంధ్య వేళ జనావాసాలను సమీపించాయి...
వెన్నెల చినుకులు నేలను తాకుతుంటే...
పురివిప్పిన నెమలిలా పూరెక్కలు పింఛాలై విచ్చుకున్నాయి...
కనురెప్పలు తుమ్మదలై కుసుమాలను చుంబిస్తుంటే...
చల్లని పవనాల జోరుకు కొమ్మలు కోలాటమాడుతున్నాయి...
అందనంటూ చందమామ ఆకాశానికి అంటుకుపోతే...
పొగల మేఘాలను ప్రక్కకు నెట్టి తళుకుల తారలు మిణుక్కుమన్నాయి...
చీకటి మైకం చుట్టుముట్టి కలల చెరలలో బంధిస్తుంటే...
ఏకాంత లోకంలో ఎద చప్పుళ్ళు రాగాలై ప్రతిధ్వనించాయి...కామెంట్‌లు