బాలగేయం ;- కోరాడ నరసింహా రావు
  బాలల్లారా... బాలల్లారా... 
  మీ నవ్వులు....
 అరవిరిసిన పువ్వులు !
    
 మీ ముద్దు - ముద్దు మాటలు... 
రామచిలుక పలుకులు.. !
..   
మీ బుడి, బుడి అడుగులు 
రాజహంసల నడకలు !
   
మీ కేరింతల తుళ్ళింతలు.. 
పురివిప్పిన నెమలి నాట్యాలు !
   
వీపున బేగులతో...
 మీరు బడికి వెళుతుంటే... 
   పెంగ్విన్ పక్షుల్లా... 
ఎంతో  ముద్దొస్తుంటారు !
   
మీరు జనగణమన అన్నా.... 
   వందేమాతరమన్నా... 
    వేద మంత్రాలలా... 
హాయిగ అనిపిస్తుంటాయి.. !
     
మీతో నిండుగ 
తరగతి గది .... 
అచ్చమైన అందాల పూలతోట... !
  
బాలల్లారా... బాలల్లారా... 
 భారతమాతకు 
ఆశాజ్యోతులు మీరే... !
     మీరు కొడిగట్టక     జ్వ

లించండి.. !
   
మనదేశ
   కీర్తికాంతులను 
     దశదిశలా 
    వ్యాపింప జేయండి !!
     *******
.
కామెంట్‌లు