"నందివర్ధనం" ;- కొప్పరపు తాయారు
 గరుడ వర్థనం లేక  నంది వర్థనం అంటారు.
ఇందులో రెండు రకాలు ఒకటి ముద్ద పువ్వులు, రెండు రెక్కల పువ్వులు.
        ఈ రెండు రకాలు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు 
అదృష్టం కలుగుతుంది దీని వలన సర్వసౌక్యాలు పొందుతాం. విష్ణువు కి, శివుడికి కూడా ఈ పువ్వులంటే ఇష్టం.  అందుచేత సకల దేవతలకు ఈ పూలతో పూజ చేయవచ్చు.
         ఈ చెట్టు మొత్తం ఆయుర్వేదంలో మందులకి ఉపయోగిస్తారు. అలాగే చిన్న చిన్న చిట్కాలుగా మనం ఇంట్లోనే వాడుకోవచ్చు కళ్ళకి ఆరోగ్యం. కంటి చూపుకి, చల్లదనానికి ముఖ్యం..
          గాయాలకు పుళ్ళకు, ఈ పసరు రాయడం వల్ల త్వరగా మానిపోతాయి. చెట్టు భాగాలన్నీ కూడా ఔషధాల్లో ఉపయోగించి ఎన్నో రోగాలను ఆయుర్వేదంలో తగ్గిస్తారు. ముఖ్యంగా మన కళ్ళు మండుతున్నప్పుడు ఈ పువ్వులు కాసేపు నీటిలో ఉంచి తిరిగి కళ్ళ పైన గాని పెట్టుకొని పడుకుంటే కళ్ళ మంటలు క్షణాల్లో తగ్గిపోతాయి..కంప్యూటర్ మీద పని చేసేవారు ఈ ముద్ద వర్ధనాన్ని కళ్ళ మీద పెట్టుకుంటే కంట్లో వేడినంత తగ్గించేస్తుంది. అంతటి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే పూజలకి అందరూ ఈ గరుడ వర్థనం లేక నందివర్ధనం చెట్టుని ఇంట్లో పెట్టుకుని ఆ పువ్వులే వాడుతే మంచిది.

కామెంట్‌లు