మనిషి తో తంటాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు ఎండ వాన శీతాకాలాలు మొహాలు ముడుచుకుని కూచున్నాయి.ప్రకృతి మాత అడిగింది "ఏంటర్రా అలా మొహాలు గంటు పెట్టుకుని కూర్చున్నారు?! వేసవి విసుక్కుంటూ అంది" ఏంచేయాలో తెలీటంలేదమ్మా! మనుషులు నన్ను దరిద్రపు ఎండ! చెమట గబ్బు కరెంటు కోత ఉక్కపోత! పదమూడు నెలలభాగ్యానికి నన్ను తిడ్తారు. మళ్ళీ మామిడి పళ్ళు  తాటిముంజలు కావాలి". వర్షం  అందుకుంది" సరేలే!రెండు రోజులు నేను ఏకధాటిగా కురిసేప్పటికిబట్టలు ఆరవు.  రోడ్డు అంతా జర్రుబుర్రు బురద.నాలాలు పొంగాయి" అని చీదరిస్తున్నారు." ఆఖరుగా శీతాకాలం అంది"మనిషికి తృప్తి సహనంలేవు.చలికాలం దగ్గు పడిశం. ఎన్ని సార్లు చాయ్ తాగినా చలికి వణికి చస్తున్నాం" అంటారు." 
ప్రకృతి మాత నవ్వుతూ అంది" మీధర్మాన్ని మీరు నెరవేరుస్తారు.వర్షంలేకుంటే పంటలు తాగే నీరు బువ్వ లేక చస్తాయి ప్రాణులు. చలికాలం లో ఉన్ని వ్యాపారులు గల్లీలో చాయ్ వేడి పకోడీ మొక్క జొన్న పొత్తులకు మంచి గిరాకీ.ధనుర్మాసం పొంగలి ఆనందం గా తినవచ్చు.వేసవి శీతాకాలంలో ఎ.సి.వాడకుండా ఉంటే కరెంటు బిల్లు తగ్గుతుంది. పరిస్థితులకు తగినట్టుగా బతకాలి. ప్రకృతి సహజ వాతావరణం లో బతికితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.శ్రామికులు అన్ని కాలాల్లోనూ కష్టపడి పనిచేస్తూ అనవసరమైన ఆలోచనలు చేయరు.అప్పనంగా కూచుని మెక్కుతూ వంకలుపెట్టేవారికి రోగాలు తప్పవు.మీరు బాధపడవద్దు" అన్న ప్రకృతి మాత కు ధన్యవాదములు చెప్పాయి ఆమూడు కాలాలు🌹
కామెంట్‌లు