అలుపెరుగని నారాయణీ టీచర్!- - యామిజాల జగదీశ్
 అరవై ఏడేళ్ళ వయస్సులోనూ చెదరని నిబ్బరం. రోజూ ఇరవై అయిదు కిలోమీటర్ల నడక ప్రయాణం. విసుగనేది లేకుండా పాఠాలు చెప్తున్న టీచర్. ఆవిడ పేరు నారాయణి. గత యాభై సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు.
మాతా పితా గురువు దైవం అంటారు కదా. వీరిలో అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చే గురువులు సామాన్యులు కారు. 
సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివించడం, తన జీతంలో పిల్లలకు అన్నం పెట్టి పాఠ్యపుస్తకాలు కొనివ్వడం, తనవద్ద చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటినే గ్రంథాలయంగా మార్చడం, ఉచిత శిక్షణ ఇవ్వడం వంటి గురువుల గురించి ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం.
అయితే అరవై ఏడేళ్ళ వయస్సులోనూ నారాయణీ టీచర్ నడిచి వెళ్ళి పాఠాలు చెప్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. 
కేరళలోని కాసర్గడ్ జిల్లా చెరువత్తూర్ ప్రాంతానికి చెందిన కె.వి. నారాయణి గారిని ఆ ప్రాంతంలో అందరూ నారాయణీ టీచర్ అనే పిలుస్తారు. ఆవిడకు  రోజు అనేది ఉదయం నాలుగున్నర గంటలకే మొదలవుతుంది. నడుచుకుంటూ వెళ్ళి ఉదయం ఆరున్నర గంటలకల్లా మొదటి విద్యార్థి ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఒక్కో విద్యార్థి ఇంటికీ వెళ్ళి పాఠాలు చెప్తుంటారు. తను చెప్పదలచుకున్న విద్యార్థులందరికీ పాఠాలు చెప్పి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంటారు.
వయస్సు మీదపడినప్పటికీ ఆమె ఏ మాత్రం అలసిపోకుండా పాఠాలు చెప్పడానికి కారణాలు రెండు. ఒకటి, కుటుంబపోషణ. రెండు, అనారోగ్యంతో మంచంపట్టిన తన భర్తను చూసుకోవడం.
తన దినసరి శారీరక వ్యాయామంగా ఈ కాలినడకనే భావిస్తున్న నారాయణీ టీచర్ తన శరీరం సహకరించేంత వరకూ నడుస్తానని చెప్పారు. ఇప్పుడు నారాయణీ టీచర్ కుటుంబం ఉంటున్నది అద్దె ఇల్లు.ఎప్పటికైనా ఓ సొంతింటిని ఏర్పాటు చేసుకోవాలన్నది ఆమె కల.
మాతృభాష మళయాలంతోపాటు మరికొన్ని భాషలు కూడా తెలిసిన నారాయణీ టీచర్ 
ఇప్పటివరకూ ఏ స్కూల్లోనూ పని చేయలేదు. పదిహేనో ఏట సరదాగా తోటి వారికి తెలిసిన నాలుగు ముక్కలు చెప్తూ వచ్చిన ఆవిడ 1971లో స్కూలు ఫైనల్ ప్యాసయ్యారు. ఆ తర్వాత ఏ కాలేజీలోనూ చేరలేదు. కానీ వివిధ సబ్జెక్టులలో పట్టు సంపాదించిన ఆవిడకు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం బాగా వచ్చు.
కోవిడ్ - 19 మహమ్మారితో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోను ఆవిడ 
పాఠాలు చెప్పడం మానలేదు. తన దగ్గర చదువుకుంటున్న పిల్లల్లు మంచి మార్కులే తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఆవిడ పాఠాలు చెప్పుకుంటూ వచ్చే డబ్బులతోనే జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇది తప్ప మరో రాబడి అంటూ ఏమీ లేదు. తన దగ్గర చదువుకున్న వారిలో ఇప్పుడు కొందరు డాక్టర్లుగా ఉన్నారన్నారు నారాయణీ టీచర్. మళయాలం సినిమాల్లో నటిస్తున్న కావ్య మాధవన్ కూడా ఆవిడ దగ్గరే చదువుకున్నారు. అప్పుడప్పుడు ఆవిడ కొందరి సహకారంతో గల్ఫ్ వెళ్ళి అక్కడుంటున్న పిల్లలకుకూడా చదువు చెప్పిన సందర్భాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలైన ఆమె తమిళనాడులోని పళని ఆలయానికి వెళ్తుంటారు. ఎంత దూరమైనా చెప్పుల్లేకుండా నడుస్తారు. ప్రతి సంవత్సరం ఆవిడ 693 మెట్లున్న పళని కొండనెక్కుతారు. ఆరోగ్యం సహకరించేవరకూ నడక, విద్యాబోధన కొనసాగిస్తానన్నారు నారాయణీ టీచర్!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం