సుప్రభాత కవిత -బృంద
ఆనందాల ఉప్పెన
ఆవేదనలను ముంచేసి
అంతరంగమధనంలో
అమృతాలు సృష్టించనీ...

అనుగ్రహపు తుపాను
కలతలనుచెల్లాచెదురు చేసి
కనుదోయి స్వప్నించిన
కలల సౌధం కట్టుకోనీ

వేడుకల వెల్లువ
వేదనలను రూపు మాపి
వేయింతలు వెలుగులు నింపి
జీవితాన్ని వెలిగించనీ...

ముసురులకునే మురిపాలు
మౌనాన్ని తరిమేసి
ముసినవ్వుల సంగీతాలు
వసివాడక నిలపనీ.....

కమ్ముకునే  సంతోషాలు
కనుపాపల వెలుగునింపి
నమ్మకంగా  బ్రతుకంతా
నాతోనే ఉండిపోనీ

ఆటు ఆనందమైతే
పోటు పరమానందంగా
అలుపులేని భావతరంగాలు
ఆనంద తాండవమాడనీ...


అవధిలేని ఆనందాంభుధిలో
ఆనంద సంగమ మధురానుభవం
అంతరంగానికి అలవాటు చేసే
హరివిల్లు లాటి  వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు