"తాతా!అన్నిదానాల్లోనూ అన్నదానం గొప్ప కదూ?" శివా ప్రశ్నకు జయ అంది"కాదు విద్యాదానం గొప్ప.అన్నం పొట్ట నింపుతుంది.కానీ చదువు తో మనిషి తనకాళ్లపై తాను నిలబడి ఇతరుల కి మార్గదర్శి కాగలడు." తాత అన్నాడు "మీరు చెప్పింది కరెక్టే కానీ నేడు అవయవదానం గొప్ప .బ్రెయిన్ డెడ్ ఐనవారికి మెదడు పనిచేయదు.కానీ శరీరభాగాలు బానే ఉంటాయి. యాక్సిడెంట్ బ్రెయిన్ ట్యూమర్ తలకి బాగా దెబ్బలు తగిలితే వెంటనే వారి గుండె ఇంకా ఇతర అవయవాలు బంధువులు దానం చేస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.చనిపోయిన 6గంటల దాకా కళ్ళు చర్మం దానం చేయొచ్చు "."తాతా!అంటే శరీరం పై చర్మాన్ని అంతా తీసుకుంటారా? మొత్తం చర్మం వదిలేస్తారా?" ఖంగారు గా అడిగారు పిల్లలు."ఉహూ!ఇదేమైనా కూరగాయల చెక్కు తొక్కతీయటం అనుకుంటున్నారా ఏంటి? వీపు తొడలపై పల్చని లేయర్ ని తీసుకుంటారు. చనిపోయిన 12 గంటల తర్వాత కూడా కళ్ళు స్కిన్
డొనేట్ చేయొచ్చు శవాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచితే చాలు. లేదా6గంటలలోపే కళ్ళు చర్మం దానం చేయాలి. మంటల్లో కాలిన యాసిడ్ దాడి తో చర్మం కాలినవారికి స్కిన్ ఉపయోగించి వారి కి కొత్త జీవితం ప్రసాదించవచ్చు." థాంక్స్ తాతా కొత్త విశేషాలు చెప్పారు. రేపు మా బడి లో చెప్పి బాగా ప్రచారం చేస్తాం" అన్నారు పిల్లలు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి