సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -166
భిక్షుక పాద ప్రసారణ న్యాయము
*****
భిక్షుక అంటే సాధువు, సన్యాసి. పాద అంటే అడుగు, వేరు, కాలు, కాంతి కిరణము,నాలుగవ భాగము,శ్లోక చరణము,కొండ దిగువ భాగము, స్తంభము అనే అర్థాలు ఉన్నాయి.ప్రసారణ అంటే వ్యాపించుట,చాచుట అని అర్థం.
భిక్షుక పాద ప్రసారణము అంటే  ఓ సాధువు  గృహస్థుని యింట ప్రవేశించి తన  ఇష్టాలను నెరవేర్చుకునేందుకు పాదం మోపే ప్రయత్నం చేయుట అని అర్థము.
అంటే  ఒకానొక భిక్షుకుడికి గృహస్థుని యింట భోజన,శయన లాభము పొందాలనే కోరిక కలిగిందట. తన కోరికను ఒక గృహస్థుని ముందు వెలిబుచ్చనైతే వెలిబుచ్చాడు. కానీ తాను ఆ ఇంట కాలుమోపుట అసంభవమని అనుకుంటూ మొదట నిస్పృహకు లోనవుతాడు.ఐతే ఆ గృహస్థుకు సాధువుల పట్ల ఉన్న భక్తి వల్ల అతని ఇంట్లో ప్రవేశించి క్రమముగా తనకున్న కోరికలను ప్రకటించి, వాటిని పొందుటలో కృతార్థుడయ్యాడనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అసలు సాధువు అంటేనే ప్రాపంచిక వ్యవహారాల నుండి విడి పోయి  ఆధ్యాత్మిక, పరమానంద స్థితికి చేరుకున్న వాడు అంటారు.అంటే ఎలాంటి కోరికలు లేకుండా భగవధ్యానంలో జీవించే వాడు.
మరి అలాంటి వ్యక్తికి ఒకానొక దశలో గృహస్థుని యింటికి వెళ్ళి  మంచి భోజనం చేయాలనీ, మెత్తని పడక మీద విశ్రాంతి తీసుకోవాలనే కోరిక కలగడమే విచిత్రం కదా! అంటే అతనికి ఇంకా ఐహిక సుఖాల మీద అనురక్తి నశించలేదని తెలుస్తోంది.
అదే భావన ఆ సాధువులో వుంది. ఉచితమా,అనుచితమా అనే సందిగ్ధావస్థ మనసును పట్టి లాగుతున్నా ఆ కోరికలు చంపుకోలేక విషయాన్ని ఒకానొక గృహస్థుని ముందు వెళ్ళడించాడు. అవి నెరవేరుతాయనే నమ్మకం లేదు. కానీ ఆనాటి సమాజంలో వారి పట్ల ఉన్న గౌరవ మర్యాదల వల్ల వాటిని పొంద గలిగాడు.
ఆ విధంగా పరమ సాధువు/ భిక్షుకుడు వచ్చి అడగ్గానే అదెంతో భాగ్యంగా భావించి ఆ గృహస్థుడు సాధువును సాదరంగా ఆహ్వానించి ఆయన కోరికలు తీర్చాడు.
ఆనాడు భిక్షుకులకూ, సాధువులకు సమాజంలో ఉన్న గౌరవం. భిక్షుకుడు, సాధువు అంటే సాక్షాత్తూ  దేవుడే ఆ రూపంలో వచ్చాడని అనుకునేవారు. అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి  పూవులతో పాద పూజ చేసి వారి కోరికలు తీర్చడమే తమ అదృష్టంగా భావించేవారు.
మరి ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులైన గొప్ప భిక్షుకులు, సాధువులు కలికేమేసి చూసినా కనబడరు. నిజంగా ఉన్నా  వాళ్ళు ఇలాంటి కోరికలు కోరరు. దొంగ భిక్షుకులు,సాధు వేషంలో వచ్చి జనాల్ని మోసం చేయడం చూసిన తర్వాత సాక్షాత్తు దేవుడే ఆ రూపంలో వచ్చినా నమ్మే పరిస్థితి లేదు.
 
 ఏది ఏమైనా  భిక్షుకులలో ఇలాంటి  కూడా ఆనాడు ఉండే వారనీ, గృహస్థులను యాచించి, వారి ఇళ్ళలో పాదం మోపి, తమ కోరికలనలా తీర్చుకునే వారనీ మనకు ఈ "భిక్షుక పాద ప్రసారణ న్యాయము" ద్వారా తెలిసింది.
అలాంటి వారికి మోక్షమెలా  ప్రాప్తిస్తుందని  వేమన ఇలా అంటాడు.
'మాటలాడు నొకటి మనసులోని నొకటి/ఒడలి గుణము వేరే యోచన వేరే/ ఎట్లు గల్గు ముక్తి యీలాగు తానుండ/ విశ్వధాభిరామ వినురవేమ '
 మనసులో ఉన్నది ఒకటి. పైకి మాట్లాడేది మరొకటి. తన అ‌సలు గుణము ఒకటి.ఆలోచన మరొకటి ఉన్న వానికి మోక్షమెలా ప్రాప్తిస్తుందని అంటాడు.
కట్టింది  సాధు దుస్తులు అయినా  కోరికలు నియంత్రించుకోలేని వారికి ఇలాంటి ఆలోచనలే కలుగుతాయని అర్థం చేసుకోవచ్చు .
 ఇలాంటి వారిని ఎంతో మందిని చూసే నాటి తరం వారు ఇలాంటి వారూ ఉంటారని చెప్పడానికి ఈ న్యాయాన్ని సృష్టించారేమో కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం