కల! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరాజు మంచి ధర్మాత్ముడు. ప్రజారంజకంగా పాలించే వాడు.ఒకసారి  తన ఇద్దరు కొడుకు లు  కొంత పరివారంతో అడవికి వేటకివెళ్లాడు.సాయంత్రం కాగానే  అంతా వేట ఆపేసి రాజధాని వైపు బైలు దేరారు.రాకుమారులకు ఇంకా సరదాగా వేటాడాలనే ఉంది. కానీ తండ్రి ససేమిరా అనటంతో బైలు దేరారు. ఓలేడికూన చావుబతుకుల మధ్య ఊగిసలాడే తల్లి దగ్గర అలా పడుకుంది.రాజు చూస్తుండగానే దాని తల్లి ప్రాణంపోయింది.రాజు ఆలేడికూనపై జాలి పడి తమవెంట తెచ్చి రాజోద్యానంలో ఉంచాడు.  ఆకూన అస్సలు గడ్డిపోచ కూడా తినటంలేదు.దాసీలు దానికి  పాలు పట్టించారు. రెండు రోజులు గడిచాయి. రాకుమారులు"నాన్నా!మళ్ళీ వేటకి వెళ్దాం" అని గొడవ  చేశారు. రాజు ఇలా అన్నాడు "నాకు రాత్రి ఓకలవచ్చింది.ఆజింకపిల్ల తల్లి ఏడుస్తూ అంది"రాజా!ఆనందం సంతోషం కోసం  అమాయకపు మాజంతువులని చంపుతున్నారు. ఎన్నో రకాల ఆహారధాన్యాలు ఫలాలున్నా మమ్మల్ని చంపి తింటారు. సరదాగా వేటనెపంతో మేము
 మీబాణాల దెబ్బకి గిలగిల 
 తన్నుకుంటే ఆనందం గా చూస్తారు.రేపు నాబిడ్డనికూడా వండుకుని తింటారా? యుద్ధంలో మీ పై శత్రువు దాడిచేస్తే బాధపడతారే?    మరి అడవిలో ఉండే మూగజీవులని చంపటం న్యాయమా?" అందుకే  వేట మానేద్దాం.ఇది కల నాకు చేసిన ఉద్బోధ". చూశారా  కల  అని భావించకుండా రాజు  దాని సారంఅర్ధం చేసుకుని నీతిగా అమల్లోకి తెచ్చాడు🌹
కామెంట్‌లు