తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బాలసభ
 తెలంగాణ ఆదర్శ పాఠశాల
బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రతినెల నాలుగువ శనివారము "నో బ్యాగ్ డే" గా ప్రకటించింది.ఆ రోజు విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను బయటికి తీసే విధంగా ఆటలు,పాటలు మాటలు,నృత్యాలు చేయడం,నాటికలు వేయడం,కథలు చెప్పడము,ఏకపాత్రలు అభినయించడం,పల్లె సుద్దులు,గొల్ల సుద్దులు చెప్పడం,వీధి నాటకాలు కోలాటం,గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడడం, పద్యాలు పాడి భావాలు చెప్పడము,శ్లోకాలకు చదివి అర్థం చెప్పడం,రంగు కాగితాలతో బొమ్మలు చేయడం(ఒరిగామి)వ్యక్తుల గురించి మాట్లాడము మొదలగు కార్యక్రమాలు చేపట్టడం వలన విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా మాట్లాడే శక్తిని సంపాదించుకుంటారు చదువుతోపాటు సాంస్కృతిక,విద్యాపరమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు.వీటితో పాటు పాఠశాల పరిశుభ్రత,తరగతి గది పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేయడము,క్షేత్ర పర్యటనలకు తీసుకువెళ్లడం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు.విద్యార్థులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కె.కృష్ణవేణి గారు గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

కామెంట్‌లు