శిఖాపాండే!అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలూ! డ్రాయింగ్ గీసి ఇవ్వండి. మొలక అంకుల్ కి పంపుతా " అన్న అమ్మ తో" ఊహూ! మేము ఆడుకోవాలి.ఆదివారం వేస్తాం " ముక్త కంఠంతో అన్నారు పిల్లలు. "ఆటలు ఎప్పుడూ ఉండేవే !ముందు డ్రాయింగ్ వేసి ఆపై ఎగరండి" సీరియస్ గా అంది అమ్మ. తాత అన్నాడు " మీరు చిన్న పనులకు గూడా బద్ధకిస్తారు.శిఖాపాండే గూర్చి వినండి. ఆమె తెలంగాణా లోని  కరీంనగర్ కి చెందిన అమ్మాయి.గోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలెక్ట్రానిక్స్  ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అప్పుడే క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది.2011లో వాయుసేనలో చేరింది. 2014లో క్రికెట్ ఆటలో ఓటమి చవిచూసినా ధైర్యం కోల్పోలేదు.టీ 20 వరల్డ్ కప్ లో తన సత్తా చాటింది. ఆమె వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్ గా వెలిగిపోతోంది ".అంతే పిల్లలు కిక్కురుమనకుండా గబగబా డ్రాయింగ్ వేయటానికి కూచున్నారు.తాత వేసిన మాటలమంత్రంకి పిల్లలు దారిలోకి వచ్చినందుకు  అమ్మ నవ్వుకుంటూ వాకింగ్ కి బైలు దేరింది🌺


కామెంట్‌లు