వనజ శతకము (అట వెలదులు )- ఎం. వి. ఉమాదేవి
 65)
తలకుమించిబరువు తానుచీమయు మోయు
కలపదుంగలన్ని కరియుమోయు
బక్కవాడుమోయు బాధ్యతల్ శ్రమలేక 
వనజ మాట మిగుల వాస్తవమ్మ!
66)
కట్టుకొనిన భార్య కళ్యాణకరమౌను
ప్రక్కచూపులేల ప్రతినిమిషము
నీతివదిలినపుడు నీకెవ్వరగు తోడు 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
67)
అందమైనహోరు నదెజలపాతమ్ము
చూరునీళ్లుజూడ చోద్యమేమి
సాధుసజ్జనముల సరిదర్శనములంత
వనజమాట మిగుల వాస్తవమ్ము!
68)
అనువుగానికాల మంగళ్ళు బెట్టించి 
సాఫ్టువేరు వారు సరుకులమ్మె
భుక్తికొరకుగాదె భూరికల్పనలన్ని 
వనజ మాట మిగులవాస్తవమ్ము 

కామెంట్‌లు