నీల -గోపి - గాలిపటం ;- వి. శాంతి ప్రబోధ

 నీల, గోపి స్నేహితులు. ఇద్దరూ పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. ఇద్దరూ కలిసి రోజూ బడికి పోతారు. బడికి పోయేటప్పుడు నీల వాళ్ళ అమ్మ కానీ, నాన్న కానీ దింపుతారు.
బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గోపీ వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది
ఈ ఇద్దరు జంట పక్షుల లాగా ఆ ఇంట్లోనో ఈ ఇంట్లోనో ఉంటారు.
ఆ రోజు వాళ్ళకి సెలవు. ఇద్దరూ గాలిపటం ఎగరేస్తున్నారు. 
అలా అలా గాలిపటం పైకి పైపైకి పోతున్నది. వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉన్నది.  ఇంకా ఉత్సాహ పడిపోతూ మరింత పైకి వదులుతూ ఆనందపడుతున్నారు. 
అంతలో ఆ గాలిపటం పుటుక్కున తెగింది.  ఎక్కడో పడి పోయింది. 
అది చూసి నీల కు చాలా బాధ కలిగింది. 
పడిపోయిన గాలిపటం కోసం గోపితో కలిసి వెతకడం మొదలు పెట్టింది.
చివరికి అది రెండేళ్ల అవతల ఉన్న తాతయ్య వాళ్ల బిల్డింగ్ మీద నుంచి వేలాడుతూ కనిపించింది. 
ఒరేయ్, గోపీ.. అదిగో అటు చూడు.. అంటూ అటుకేసి పరుగెత్తింది నీల. 
ఆమె వెనకే గోపీ కూడా పరిగెత్తాడు.
డాబా వెనుక వైపు పిట్ట గోడ నుండి ప్రహారీ గోడ వైపు వేలాడుతూ ఉండడం చూశాడు. 
అంతలో నీల ఆ యింటి ప్రహరీ గోడ ఎక్కేసింది.
ఏయ్..  నీలా అట్లా ఎందుకు ఎక్కావు?  గాలిపటం మనకి అందదు. తాతయ్యని అడిగితే వాళ్ళు ఇస్తారు అన్నాడు గోపి. కానీ నీల వినిపించుకోలేదు. 
రెండు కాళ్ళ ముని వేళ్లపై నుంచుని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నది నీల. కానీ, అది అందడం లేదు. గాలికి అటు ఇటు కదులుతున్నది. 
ఒసే.. పడిపోతావే.. జాగ్రత్త."  అరిచాడు గోపి. 
ఒరేయ్.. అట్లా అరవకపోతే, చిన్న కర్ర అందుకోవచ్చుగా..  కసిరింది నీల
కర్ర పుల్ల కోసం వెతుకుతున్నాడు గోపి.
వీళ్ల మాటల అలికిడికి "ఎవరదీ" అంటూ ఇంట్లో నుంచి ముందు వాకిట్లోకి వచ్చింది అవ్వ.  ఎవరూ కనిపించక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. 
ఆవిడకి అసలే కోపం ఎక్కువ.  తనని చూస్తే ఏమంటుందోనని భయం వేసింది నీలకి. అట్లాగని గాలిపటం వదిలి పోవడం కూడా ఇష్టం లేదు.
అవ్వ గొంతు వినపడలేదు.  ఇటు రావడం లేదులే... హమ్మయ్య బతికిపోయాను. లేకపోతేనా... తిట్టిపోసేది. అమ్మకి నాన్నకి ఫిర్యాదు చేసేది అనుకుంది నీల. 
సరిగ్గా అప్పుడే గాలికి కొద్దిగా కిందికి జారింది గాలిపటం. 
మళ్లీ ప్రయత్నించింది నీల. 
"ఏయ్.. గాలిపటమా .. ఏంటే నువ్వు.. ఏంటి నీ సంగతి?  ఆ.. , అందినట్టే అందీ అందకుండా ఆటలు ఆడుతున్నావా..?
ఓ గాలిపటమా..అందక పోయావో .. చూడు.. నీ పని చెప్తా .." గాలిపటాన్ని చూస్తూ బెదిరించింది నీల. 
ఈ గోపీగాడేమయ్యాడు అని తిట్టుకుంది. 
మళ్లీ మొన వేళ్లపై నుంచుని అందుకో బోయి డమాల్ మని కింద పడిపోయింది. కెవ్వున అరిచింది.
అయ్యో .. ఏమయిందీ..పరిగెత్తుకొచ్చాడు గోపి. 
మొఖమంతా గీరుకుపోయిన నీల కేసి బాధగా చూశాడు. లే..ఇంటికి పోదాం. చేయి అందించాడు. 
వాడి చేయి అందుకుని లేవబోయింది, కానీ నీల లేవలేక పోయింది. నడుము పట్టేసింది. 
ఆ చప్పుడుకి తాతయ్య "ఎవరదీ .. " అంటూ బయటికి వచ్చాడు. 
అంతలో గాలిపటం గాలికి కిందకు జారి సొరపాదుకు పెట్టిన కర్రకు చిక్కింది.  ఆ గాలిపటం చూడగానే నీల కళ్ళలో మెరుపు మెరిసింది. 
"ఒరేయ్ ఆ గాలిపటం తీయరా గోపి అంటూ పురమాయించి లేచే ప్రయత్నం చేసింది. 
తాతయ్య అడుగుల చప్పుడు దగ్గర అవుతున్నది.  
గాలిపటం అందుకుని "ష్.. ఏం లేదు తాతయ్యా.. "అన్నది నీల.  రెండు చేతులూ చెవులకు పైన కొమ్ముల్లాగా పెట్టి ఊపుతూ వ్వెవ్వే .." అంటూ పరుగు పెట్టా గోపి. 
పట్టేసిన నడుముతో పరిగెత్తలేని నీల ఒరేయ్ గోపీ ఆగరా  అంటూ అరుస్తోంది. 
గోపి చేతిలోని గాలిపటం, నీల మొహం, చేతులపై గీసుకుపోయిన మరకలు  తాతయ్య చూశాడు. 
ఆ పిల్ల చేష్టలకు చిన్నగా నవ్వుకున్నాడు తాతయ్య. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం