సుప్రభాత కవిత ;- బృంద
కఠినమైన శిలల మధ్య
కమ్మనైన జలధారలు
కడలి చేరు పయనాన
కదిలిపోవు మజిలీలు

ఎత్తునుండీ దూకిన
చినుకులన్నీ కలిసి
ఏరులై వాగులై వంకలై
నదితో కలిసి కడలి చేరు

ఆకాశంలోంచి అగాధంలోకి
పయనమయే యాత్రలో
లోయలెన్నో మలుపులెన్నో
అవరోధాలెన్నో ఆత్రాలెన్నో

పల్లమున్నచోట  కాస్త ఆగి
వాలు ఉన్నచోట వడిగ సాగి
చిన్నిదారిలో జోరుగా
పెద్ద నదిలో గంభీరంగా

కలిసిన కల్మషాన్ని కూడా
కలుపుకుని గమ్యం వైపే
పయనించే ప్రవాహం
బోధించే పాఠాలెన్నో

ఏది వచ్చినా  అదే మనదని
అడ్డంకులొస్తే ఆగరాదని
దారిమారవచ్చు కానీ
గమ్యం మారకూడదని

ఇవ్వడమే కానీ
ప్రతిఫలం ఆశించని
జలధార  గుణములన్నీ
జీవనధారకు సూత్రాలు

ఉదయం తెచ్చే మధురాల
మూటలకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు