*కష్టజీవి *; - వై నీరజారెడ్డి..-తెలుగు భాషో పాధ్యాయురాలు..జడ్పీహెచ్ఎస్ పన్యాల..
సిరులు పండే పల్లె సీమ, వనరులు ఎన్నో ఉన్న రత్న గర్భ .
ఒంటి చేత్తో బతికే సత్తా ఉన్నా. 
దగాకోర్ల ముందు సెయి సాపుడే0ది .
కాయ కష్టం చేసి గంజినీళ్ళ కోసం గుంజిల్లు దిీసుడే0ది..

తాళి పుస్తెలు అమ్మినా కూడా తెచ్చిన అప్పు తీరకపోవడమే0ది..

పొద్దుపొడువంగా ముళ్ల గర్ర చేతబడ్తే
బారెడున్న ముళ్ల గర్ర జానడాయే .
తల్లిపాలు తాగే గొర్రెపిల్ల కానల దప్పి కండ్లు వొయిన బాధ . 

దగా కోరుల రాజ్యమాయే, మనిషి విలువే మాయ మాయె, 
బతుకు వాయే వెుతుకువాయే. 
వలసవోయి బతుకుడాయే. 

గూడు చెదిరిన పక్షులోలే. పుట్టకొకరు గుట్టకొకరై. దొరల గడిల ముందుజీత0 ఉండుడాయే.**

కామెంట్‌లు