నవయవ్వనవతి (చిట్టి వ్యాసం); - :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నాలుగువందల ఏళ్ళ పురాతనపట్టణం ఈ హైదరాబాద్. కాని, ఇప్పుడిప్పుడే నవయవ్వనంలోకి అడుగిడుతున్నట్లుంది కదూ! తోటలూ, పేటలూ, కోటలూ, చెరువులూ, దుకాణాలూ, హోటళ్ళూ, సినిమాహాళ్ళూ, షాపింగుమాళ్ళూ
తళతళా మిలమిలా మెరిసే హుస్సేన్సాగర్ అందాలు, అబ్బో అబ్బబ్బో ఏమనిచెప్పను.
ఎన్నోదేశాలు, ఎన్నోరాష్టాలనుండి వచ్చినవారు ఎన్నోమతాలు, ఎన్నోకులాలవారు నివసిస్తూ
పట్టణ అందాలను ఇనుమడింపజేస్తున్నారు. రంజాన్ పర్వదినాలు, హోలీ సంబురాలు,
గణేశ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు,
దాండియా నాట్యఝరులు మనోరంజితాలు. బిర్యానీ, మిఠాయి, ఐస్క్రీం, రబ్డిమలాయి వంటి ధనవంతులు తినేవే కాదు, గరీబులు తమ కాలేకడుపు నింపుకునే
పానీపురీ, చాట్, పావ్భాజీ, సమోసా, చాయ్ లుకూడా హైదరాబాద్ పట్టణంలో ఉన్నాయి. అందరికీ కూడు గూడు గుడ్డ దొరికే అక్షయపాత్రే ఈ హైదరాబాదు !!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు