మాట మనసే అందం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా ఇంటికి దూరపుబంధువులు వచ్చారు. ఆపిల్లాడు పదేళ్ళ వాడు పట్నంపోజులు కొడ్తూ శివా ని హేళన చేస్తున్నాడు.శివా అసలే బిడియం కుంచించుకుపోయే స్వభావం. తాత ఇది గమనించి "శివా!రాజా! ఇలాకూచోండి.మీకు ఓకథ
 చెప్తా.జనకమహారాజు సభకి  కురూపి అష్టవంకరలు తిరిగిన  బాలుడు వచ్చాడు.అతన్ని చూసి అంతా హేళన గా నవ్వుతూ " ఆత్మ జ్ఞానం  ఆత్మ బోధ చర్చకు నీవు వచ్చావా?" అని వ్యంగ్యంగా మాటల ఈటెలు విసిరారు. ఏమాత్రం కించపడకుండా అష్టావక్రుడు నవ్వుతూ " రాజా!పైపై మెరుగు లు  అందాలు చూసే వీరికి ఆత్మ  ఆత్మ జ్ఞానం అంటే ఏంతెలుసు? నాశరీరం వంకర కానీ నా ఆత్మ కాదు.మీరు నాచర్మం చూసే తోలువస్తువులు తయారు చేసేవారు. మీరు వేదాంతులు  ఆత్మ జ్ఞానం కలవారు కాదు. " అంతే రాజు అతన్ని  గురువు గా స్వీకరించాడు." తాత చెప్పి న కథవింటూనే శివా ఉత్సాహంగా అన్నాడు "తాతా! నేనింక ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ తో బాధపడను..నాలాగా చెట్టు ఎక్కగలవా రాజా?" అంతే వాడు బిక్కమొహం వేసి "మాఅపార్ట్మెంట్ లో చెట్లున్నా ఎక్కనీయరు. మామమ్మీ బడి నుంచి రాగానే బైట కి పంపదు
తనతోటే ఉండాలి. కాసేపు టి.వి.చూడనిచ్చి పుస్తకాల ముందు కూలేస్తుంది" దిగాలు గా అన్నాడు. శివా కి వాడి మీద జాలేసింది. రాజా తండ్రి కి చెప్పి పిల్లలు ఇద్దర్నీ తీసుకుని తాత ఆపల్లె అందాలు చూపటానికి షికారు తీసుకుని వెళ్లాడు🌹    .
కామెంట్‌లు