ధృతరాష్ట్ర పుత్రులు (చిట్టి వ్యాసం);- : డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అవును మరి వాళ్ళు ధృతరాష్ట్ర పుత్రులే! వాళ్ళకేం పర్వాలేదు, ఏపాపాలూ అంటవు అనుకుంటారు. అత్యాచారాలూ, అన్యాయాలూ, అక్రమాలూ చేస్తారు. ఇళ్ళూ, ఒళ్ళూ దోచుకుంటారు. హత్యలూ, మానభంగాలూ చేస్తారు. పిల్లల్నీ, ఆడపిల్లల్నీ పరదేశాలకు అమ్మేస్తారు. పొలాలూ, ఇళ్ళూ, ఇళ్ళస్థలాలూ కబ్జాచేస్తారు. కోటానుకోట్లడబ్బు బ్యాంకుల్లో అప్పుతీసుకుని పరదేశాలకు ఎగిరిపోయి ఖుషీగా ఉంటారు. గడ్డిమేస్తారు, రోడ్లు భోంచేస్తారు. ఓట్లు కొంటారు, మాదకద్రవ్యాలు అమ్ముతారు. సరుకుల్లో మోసం, తూకంలో మోసం, కొలతల్లో మోసం, మాటల్లో మోసం. పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, మనసులు కల్తీ, మనుషులు కల్తీ. అది ఏప్రార్థనాస్థలం కానీ అక్కడ
మోసగాళ్ళు తిష్టవేసి పొంచి ఉంటారు. కాని, ప్రతిఒక్క ధృతరాష్ట్ర పుత్రునికీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తన తడాఖా చూపిస్తాడు ఆ దేవుడు. అప్పుడు వాళ్ళకి ఉంటుందీ " జింతాతా చితా చితా" !!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు