వాటర్ విజ్ఞానం ;- ఎస్ మౌనిక

 హాయ్! మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారేంటి? నేనైతే ఫుల్ హ్యాపీ!మరి మీరు? విషింగ్ ఏ వెరీ హ్యాపీ డే!🤝🤝..... ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసిందిగా! ఈరోజు మనం నీటి గురించి కొన్ని ఆసక్తికరమైన  విషయాలు తెలుసుకుందాం. వింటే  నిజంగానా! అని అనిపిస్తుంది మరి! ఇప్పుడు సరదాగా నీటితో ఆడుకుందామా? ఏం లేదు. గుప్పెడు నిండుగా నీళ్ళని తీసుకొని ఒక్కసారి పైకి ఎగరేయండి. ఆ నీరు మన మీద పడుతుంటే ఆ ఆనందమే వేరు కదా? నీటిని పైకి ఎగిరేసినప్పుడు అవి గోళాకారంలోనే మారుతాయి. అంటే స్పెరికల్ షేప్ లోకి మారుతాయి. త్రిభుజాకారం లోకి,చతురస్రాకారంలోకి ఎందుకు మారవు? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? నీటిని మనం పైకి ఎగిరేసినప్పుడు అది పెద్ద బిందువులుగా మారుతుంది. అప్పుడు అది తక్కువ ఉపరితల విస్తీర్ణంలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. దానికి తోడు గాలిలో అన్ని వైపుల నుండి  సమానమైన ఫోర్స్ ఉంటుంది. మిగిలిన అన్ని ఆకారాలలో అంటే  చతురస్రం కానీ, త్రిభుజం కానీ మిగతా ఏ ఆకారాలతో పోల్చుకున్నా గోళాకారానికే ఉపరితలం తక్కువగా ఉంటుంది. నీరే కాదు..... ఏ ద్రవరూపమైన కానీ..... గోళాకారంలో ఉండడానికి ఇష్టపడుతుంది. దాన్ని పైకి ఎగరేసినప్పుడు..... తెలుసుకోవడానికి వింతగా అనిపిస్తుంది కదూ!.... నాకైతే అలానే అనిపించింది మొదటిసారి విన్నప్పుడు..... ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ నేస్తం మీ కోసం తీసుకురావడానికి రెడీ! త్వరలో ఇంకో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. ఓకేనా? బాయ్! 👋👋
కామెంట్‌లు