* సూర్యుడి తాపం* - నీరజారెడ్డి వై .తెలుగు భాషో పాధ్యాయురాలు. జడ్పీహెచ్ఎస్ పన్యాల.
 సూరీడు మెల్లగా లేచి, కనులు నలుముకుంటూ అడుగు పెట్టాడు భూమిపై.

 బంతి తోటలోని

 బంతులన్నింటినిమెల్లగా తాకాయి రవికిరణాలు. ఆ తాకిడికి ఒక్కక్షణం అటూ ఇటూ ఊగిసలాడాయి.

 మనసులోనే నవ్వుకున్నాయి బంతులన్నీ ముసిముసిగా

 ఏంటి దురుసుతనం అన్నట్లుగా కొంటెగా చూశాయి రవి వైపు.

 ఉషోదయంలో ఏమిటి నాకీ పరీక్ష అని పుష్పాలకవ్వింపుకు పొంగిపోయాడు రవి . 

ఎగసెగసిపడుతుంది గోదారమ్మ .సూర్యుడు జాడకనరాలేదని, ఇంతలోనే యేతెంచిన సూర్యుడికై తన కెరటాలు చాచింది ఆత్మీయంగా. 

కానీ భూతల్లి ఎందుకో అలిగింది సూర్యుడిపై. 
భానుడి  తాప0 తాళలేకనేమో. 

వానమ్మను కోరింది దీనంగా .
తనని ఒక్కసారి ముద్దాడి పొమ్మని. 

కామెంట్‌లు