శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 దేవనాగరి లిపి మనదేశంలోని ప్రసిద్ధ లిపి.ఇందులో సంస్కృతం హిందీ మరాఠీ మొదలైన భాషలు రాయబడ్తాయి.నాగర బ్రాహ్మణ లిపి కారణంగా నాగరీ అనేపేరు వచ్చింది.నాగరీలిపి ప్రయోగం గుజరాత్ తామ్రపత్రాల్లో కన్పడింది ఉత్తర భారత్ నుంచి బ్రాహ్మణులు కనౌజ్ పాటలీపుత్రం మొదలైన ప్రాంతాలకి వలసపోవటంతో నాగరీలిపి గుజరాత్ లో వ్యాపించింది.9-10శతాబ్దాల్లో గుజరాత్ రాష్ట్రకూటులు బంగ కలింగ మగధ మాల్వా ప్రాంతాల్లో తమరాజ్యాన్ని విస్తరింప జేశారు.వారి నాగరీ పురోహితుల లిపికూడా ఉత్తర భారతదేశంలో నాగరీ అనేపేరు తో ప్రసిద్ధి చెందింది.కొందరి అభిప్రాయం ప్రకారం తాంత్రిక యంత్రాలు పై ఉండే చిహ్నాలు నాగరీకి సంబంధించినవే!ఆచిహ్నాలని దేవనగర్ అనేవారు.ఆలిపి దేవనాగరి లిపి ఐంది. 
బ్రాహ్మీలిపి10వ శతాబ్దంలో బెంగాలీ గుజరాతీ కైథీ మహాజని లిపులమధ్య సంబంధం ఉంది.యు.పి.బీహార్ మధ్య ప్రదేశ్ రాజస్థాన్ లలో శిలాఫలకాలు తామ్రపత్రాల్లో నాగరీలిపి ఉంది.12వశతాబ్దిలో వర్తమాన నాగరీలిపి వాడుక లో కి వచ్చింది.🌹
కామెంట్‌లు