కుర్తాళం పీఠాధిపతిచే 'అయ్యలసోమయాజుల'కు సత్కారం.

   విశాఖపట్నంలోని లాలితాపీఠం లో అంగరంగ వైభవంగా  తొమ్మిది రోజుల పాటు గురు ఆరాధన మహోత్సవాలు జూన్ 4 నుంచి  12 వరకు  కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ  సిద్ధేశ్వర భారతీనంద స్వామి గారు మరియు శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీనంద స్వామిని వారిచే  జరిగిన సందర్భంగా చివరి రోజు జరిగిన కవి సమ్మేళనం లో 
కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్   విశాఖపట్నం 
'గురవే సర్వలోకానాం' అన్న కవిత ద్వారా సమాజకల్యాణమే గురు ధ్యేయం అన్నది  చెప్పినప్పుడు పీఠాధిపతి  సిద్ధేశ్వరనంద స్వామి ఆశీర్వదిస్తు పూలదండ మరియు శాలువ  ద్వారా ఘనంగా సత్కరించారు
కార్యక్రమం ప్రముఖ సాహితీ వేత్త, కవి రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య టి.పి.ఎన్ ఆచార్యులు మరియు  సాహితీ విశ్లేషకులు విశ్రాంత ఆచార్యులు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారి ఆధ్వర్యంలో లలితా పీఠ ప్రాంగణంలో జరిగింది.
ప్రసాద్ మాష్టారుని సాహితీమిత్రులు మరియు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేశారు. బదులుగా  ప్రసాద్ మాష్టారు మంత్రద్రష్ట, నడయాడే కాలభైరవ స్వరూపులైన సిద్దేశ్వరానంద స్వామి చే ఆశీస్సులు పొందడం నా జీవితాన మరువలేనిది అని పూర్వజన్మ సుకృతం అని బదులిచ్చారు...!!
కామెంట్‌లు