నేను లేనిదే నీవు లేవు:::;- రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, హైదరాబాదు.
మీ తల్లికి తల్లిని నేనే...!
మీ తల్లి తో పాటు తల్లిని నేనే...!
మీ తల్లి తర్వాత కూడా తల్లినినేని...!

చెట్టును నేనే, పుట్టను నేనే...!
అందమైన గుట్టను నేనే...!
మట్టిని నేనే, దానితో వేసే కట్టను నేనే..!

నల్ల మబ్బుల ముంగురులలో నేనే...!
చల్లగాలికి మయూరాల నాట్యంలో నేనే...!
పైరగాలి వయ్యారాలలో నేనే...!

చినుకు చినుకు తుతుంపరలను నేనే...! 
దూరంగా జడివాన ధారలను నేనే...! 
ఏకమైన నీటి ప్రవాహంలో నేనే...!

సెలయేటి గలగలలో నేనే...!
ఎగిరేటి జలపాతంలో నేనే...!
చిరుగాలి సవ్వడిలలో నేనే...!

చెరువును నేనే...!
చెరువులో ఎగిరేటి చేపను నేనే...!
వాటికి నిలయమైన ఆవాసాన్ని నేనే...!

శక్తినిచ్చే కూడుని నేనే...!
సేదను తీర్చే నీడను నేనే...! 
నువ్వు కట్టుకున్న గూడును నేనే...?

అందమైన రాయిని నేనే...!
చందమైన రప్పను నేనే...!
అందులో పూజించే రూపాలను నేనే...!

ఎగసిపడే అలలకు గమ్యాన్ని నేనే...!
విష మలినాలకు ఆకలింపు నేనే...! 
మితిమీరితే ముంచే సునామిని నేనే...!

నీ విషపు సృష్టిలో ఆస్వాదాన్ని నేనే...!
నీ వికృత చేష్టలకు భరింపు నేనే 
నా పకృతి చేష్టలకు ఆకలింపును నేనే...!

ఊపిరైన ప్రాణవాయువు నేనే...! 
ఆయునైనా జీవధారను నేనే...! 
ఆదమరిస్తే మరణశయ్యను నేనే...!

నీ జీవితానికి ఆలనను నేనే...!
నీ జీవనానికి పాలనను నేనే...!
విర్రవీగి ఆదమరిస్తే నీ నాశనాన్ని నేనే...!

పాడెను నేనే...!
నిన్ను కాల్చే కాడు నేనే...!
చివరికి నీ కడసారి తల కొరివి కాడ నేనే...!

ధర్మాన్ని పాటిస్తే కాపాడేది నేనే...! 
అధర్మాన్ని నడిపిస్తే కాలరాసేది నేనే...! 
అర్థం చేసుకొని నడిస్తే ఆదరించేది నేనే...!

అందమైన ప్రకృతి నేనే...!
మానవ వికృతి పరిష్కారం నేనే...! 
ఆదమరిస్తే అంతం చేసేది నేనే...!

ఇన్ని నేనై ఉన్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకో...!
నన్ను నీవై తెలుసుకో...!
ఈ ప్రకృతిని తల్లిని కాపాడుకో...!


కామెంట్‌లు