చదువు..... !;- కోరాడ నరసింహా రావు !
నీకు, నువ్వో కావ్య గ్రంధమై.... 
 నిన్ను, నువ్వు చదువుకుంటే... 
   అనుకోని పొరపాట్లు... 
    కూడని  తప్పులు.... 
.... కనిపించి... 
  పచ్చాత్తాపం పొటమరిస్తుంది!

పరిస్థితులు నిన్ను నియంత్రించటం మూలాన 
 అవన్నీ  అలా జరిగిపోయినా... 
 బాధ్యత వహించవలసినది,ఫలితం అనుభవించవలసిందీ  నువ్వే... తప్పదు... !
     తప్పులు - పొరపాట్లు.... మానవ సహజమే అయినప్పటికీ..., ఆత్మావలోకనం తో... అంతర్మధనం చేసుకుని పాస్చాత్తాపం పడ్డవారే మనుషులు !
    పచ్ఛాజాతాపమంటే.... 
చేసినతప్పునోమారు తలచి నాలుక కరుచుకుని... మరల - మరలా... పదే, పదే అదే తప్పును చేస్తే... అది పచ్చాత్తాపమెలా అవుతుంది !?
     పచ్చాత్తాపం చెందటమంటే... మరలా ఆ తప్పును జన్మలో ఎప్పుడూ  చెయ్యకుండా ఉండటం !
  అదీ... ఆ చదువుకైనా... ఈ చదువుకైనా సార్ధకత... !!
        ******


కామెంట్‌లు