కాలాంతరంగం; - డా.భోజన్నగారి అనసూయ.నిజామాబాద్
  ఆషాఢo వచ్చింది చినుకులు మెరిసినయ్
   నా చేతికి మైదాకు నా కళ్ళకి అందంగా
  
   ఈ అందం ఆనందం మైదాకు వల్ల కాదేమో
   వేడికి వడలిపోయిన వంటికి వాన ఇచ్చిన వరం
 
  కాలాలు చిత్రమైనవి ఒకటి నడుస్తూ వేరే కాలాన్నే
  మళ్ళీ మళ్ళీ గుర్తుకుతెస్తాయి..ఎంత విచిత్రం...
 
  కాలమేమో నువు ఎప్పుడు తృప్తి పడతావో
    చూస్తున్న మిత్రమా! అనే అంటుంది
   
  కాలం ప్రకృతి మననెప్పుడూ కనిపెట్టే ఉంటాయి
    పలు సూచనలు మనకిస్తునే ఉన్నాయి

    మనం 'సీతయ్య'లమై విననంటే వేటిపని వాటిది
     మళ్లీ మొదటికి వచ్చి ఏడుచుడే మన గతి.

కామెంట్‌లు