పురుగుమందుకు జై! (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తన చెమటను పంటగా మార్చటానికి ఆరుగాలం చేసిన కష్టంతో రైతు ఆగమాగమే అయిండు. నాగలిబట్టి, ఎడ్లనుగదిమి, పొలమంతా సాలెనుక సాలుగా దున్ని, రామసక్కని రీతిన సింగారిచ్చి, దుక్నంలదెచ్చిన యిత్తుల్ని జల్లిండు. అయినా....
యిత్తు మొలవకపాయె. మొలిచినయిత్తుకు రోగంబడె. మిగిలిన పంటకు ఆనలేక ఎండె.
మొండిగా పండిన పంటకు మార్కెట్ల గిట్టుబాటుధర లేకపాయె. గిట్ల దుక్నపోల్ల దగ్గర్నించి
పురుగులు, ఎండ, ఆన, మార్కెటు అంతా మోసం జేసిరి. చేసిన అప్పులు దీర్చేటందుకు
తొవ్వలేక పురుగులమందు దాగె. పాపం! ఆ పురుగులమందొక్కటే రైతును మోసం జెయ్యలే. అందుకే.... పురుగుమందుకు జై !!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
గ్రామ్య భాషలో చక్కటి చిరు వ్యాసం. బాగుంది సార్. అభినందనలు ధన్యవాదములు. 🙏