సమాజహితం (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 గతం గతః. నేడు మాత్రం కవితాసమాజం
కులాలవారీగా, మతాలవారీగా విడిపోయింది. ఎస్సీ కవిత, ఎస్టీ కవిత,
బిసీ కవిత, ఓసీ కవిత, రెడ్డి కవిత, విశ్వబ్రాహ్మణ కవిత, ముస్లిం కవిత, హిందూ కవిత ఇలాగన్నమాట. అంతేనా అంటే, ఇంకా ఉంది సుమా!
కమ్యూనిస్టువాద కవిత, సోషలిస్టువాద కవిత, స్త్రీవాద కవిత, లేబర్ రూం కవిత,
భక్తి కవిత, రక్తి కవిత, బాల కవిత, ప్రౌఢ కవిత, ప్రేమ కవిత, మిస్టిక్ కవిత అబ్బో! జాబితా చాంతాడంత ఉంది. అయినా,
కొంతమందే ఒక్కో కవికూటాలకు అతుక్కుపోయి ఉంటారు. చాలామంది కవులు కొద్దోగొప్పో అన్నిరకాల కవితలూ రాస్తారు. సమాజహితానికి కృషిచేస్తేనే కుల కవి కూటాల మనుగడ సాగుతుంది.
లేదా అంతే సంగతులు!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు