బహుమతి (చిట్టి వ్యాసం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 రాజే గజదొంగైతే?… కంచే చేనుమేస్తే?… తల్లే బిడ్డను చంపేస్తే?… న్యాయవాది అన్యాయవాదిగా మారితే?... నాగరికులు అనాగరికులుగా మారితే?... ఇంకేముంది
లోకమంతా హాహాకారాలే. విలువలకు వలువలుచుట్టి మమ్మీని చేస్తారు. బతుకు భారంతో ప్రజలు కుంగిపోతారు. ఖజానా ఖాళీగా దర్శనమిస్తుంది. సత్యం అసత్యం గా మారుతుంది. జ్ఞానం అజ్ఞానం గా మారుతుంది. మానవత్వం రాక్షసత్వంగా మారి ప్రజలను పీక్కు తింటుంది. రక్షణ కరువై రాజ్యం తిరోగమనంతో భ్రష్టుపట్టి అధఃపాతాళానికి జారుతుంది.
ధర్మాధర్మ, న్యాయాన్యాయ విచక్షణలు కోల్పోతే ప్రజలకు ఇక్కట్లే బహుమతి.
జనరంజక పాలనే రాజుకు, రాజ్యానికి శ్రీరామరక్ష !!!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు